VIDEO: 'రైతులు మూడు రోజులు కోతలు వాయిదా వేసుకోవాలి'
ASR: దిత్వా తుఫాను ప్రభావంతో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఈ 3 రోజులు వరిపంట కోతలు వాయిదా వేసుకోవాలని ఆయా ఏవోలు తెలిపారు. ఈనెల 3 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. కనిష్ఠంగా 0.4మి.మీ. నుంచి గరిష్ఠంగా 7.8మి.మీ. వర్షపాతం నమోదవుతుందన్నారు. సోమవారం చింతపల్లి మండలంలో 5.4 మి.మీ వర్షపాతం నమోదైంది.