నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి: ఎమ్మెల్యే
MDK: నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు లేవని, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం శివంపేట మండలంలోని గోమారం గ్రామంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మరచిపోలేదని ఆమె అన్నారు.