అధికారుల నిర్లక్ష్యం.. మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు

KNR: శంకరపట్నం మండలం కాచాపూర్ ఊరకుంటా చెరువులో మూడు రోజుల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రెవిన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవట్లేదాన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలు తావిస్తున్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పందిచాలన్నారు.