వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

ATP: సెయింట్ పాల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీపీ, ఇతరత్రా చిన్న వ్యాధులకు పరీక్షలు చేయించుకోటానికి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.