ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: బంటుమిల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గురువారం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను బాధ్యతగా స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.