పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
HNK: ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌ను సీపీ సన్ ప్రీత్ సింగ్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో పని చేసే అధికారుల, సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలని తెలిపారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.