VIDEO: '10 వేల బీడీలకు 600 కట్ చేస్తున్నారు'

SRCL: బీడీ కార్మికులకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలో బీడీ కార్మికులతో గురువారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. 10 వేల బీడీలను చేస్తే 600 బీడీలను టేకేదారులు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. PF కటింగ్ కంపెనీ చేస్తున్నప్పటికీ మళ్లీ టేకేదారులు వసూలు చేస్తున్నారన్నారు.