అమరావతి మన ఆత్మగౌరవానికి ప్రతీక: బాలయ్య

అమరావతి మన ఆత్మగౌరవానికి ప్రతీక: బాలయ్య

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేయడంపై బాలకృష్ణ హర్షం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, CM చంద్రబాబు, బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్లమెంట్ సభ్యులకు బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఇది అమరావతి రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు, భవిష్యత్ తరాల కలలకు లభించిన న్యాయమని పేర్కొన్నారు. అమరావతి మన ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు ప్రతీక అన్నారు.