'మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
కృష్ణా: పీజీఆర్ఎస్ వేదికలో మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.