ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. నలుగురు మృతి
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా 68 క్షిపణులు, 430 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఈ దాడిలో పలు నివాస భవనాలు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.