ఊట్కూర్‌‌లో గంజాయి పట్టివేత

ఊట్కూర్‌‌లో గంజాయి పట్టివేత

NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని స్థానిక అయ్యప్ప స్వామి సన్నిధానం వెంచర్ సమీపంలో ఆదివారం 125 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. ఎస్సై రమేష్ కథనం మేరకు.. విశ్వసనీయ సమాచారంతో మండల పరిధిలోని పులిమామిడి గ్రామానికి చెందిన చెట్టు కింది అరవింద్ (22), కర్ణాటక రాష్ట్రం గురుమిట్కల్‌కు చెందిన సంజీవ్ (23) నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు.