CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JGL: జగిత్యాల పట్టణంలోని 25వ వార్డు, తిప్పన్నపెట్‌కు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 50వేల రూపాయల విలువైన చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముల్ల పవన్, జుంబర్తి శంకర్, జుంబర్తి రాజకుమార్, రాజేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.