ఏల్చూరులో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు భీజామృతంతో విత్తన శుద్ధిపై గురువారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సైదా పాల్గొన్నారు. భీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వల్ల భూమి, నేల నుంచి వ్యాపించే తెగుళ్లను నివారించవచ్చని ఆయన చెప్పారు. ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో తోడ్పడుతుందన్నారు.