వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వర ప్రసాద్

కోనసీమ: అయినవిల్లి మండల వైసీపీ ప్రసార కమిటీ అధ్యక్షుడిగా గోడి వరప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ.. వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మండలంలోని పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.