తాడిపత్రిని ‘టెంపుల్ సిటీ’గా గుర్తించాలి: జేసీ
ATP: గుత్తి కోట ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ JC ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రం సమర్పించారు. తాడిపత్రిలోని అద్భుత శిల్పకళా సంపదను గుర్తించి కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద ‘రాయలసీమ టెంపుల్ సిటీ’గా అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకోసం ఫెస్టివల్‌లో స్టాల్‌ను ఏర్పాటు చేసి తాడిపత్రి ఆధ్యాత్మిక విశిష్టతను వివరించారు.