తూప్రాన్‌లో బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం
MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ, బాల్యవివాహాలపై అధికారులకు అవగాహన కల్పించారు. తూప్రాన్ ఎంపీడీవో శాలిక ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమం ప్రారంభించారు. 18 ఏళ్ల లోపు చిన్నారులందరూ పాఠశాలలోనే ఉండాలని సూచించారు. 11 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారుల వివరాలు పూర్తిగా ఉండాలని పేర్కొన్నారు.