ఇరాన్ దిశగా అమెరికా మూడో విమాన వాహక నౌక

ఇరాన్ దిశగా అమెరికా మూడో విమాన వాహక నౌక

ఇరాన్‌ను అమెరికా హెచ్చరించిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన మరో విమాన వాహక నౌక పశ్చిమాసియాలో మోహరించనుంది. వర్జీనియాలోని నార్‌ఫోల్క్ నుంచి 'USS HW బుష్' నౌక పశ్చిమాసియా దిశగా బయల్దేరిందని అమెరికా రక్షణ మంత్రి వెల్లడించారు. ఇప్పటికే పశ్చిమాసియాలో USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్, USS అబ్రహాం లింకన్ అనే రెండు విమాన వాహక నౌకలు మోహరించిన విషయం తెలిసిందే.