VIDEO: రహదారిపై మూగజీవులు హల్‌చల్
ASR: డుంబ్రిగూడ మండలంలోని కురిడి, అరకు ప్రాంతాల్లో జాతీయ రహదారిపై మూగజీవులు అధికంగా సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రహదారిపై గుంపులుగా తిరుగుతున్న పశువులు ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు.