సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు 245 నామినేషన్లు

సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు 245 నామినేషన్లు

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సర్పంచి స్థానాలకు 207 మంది నామినేషన్ దాఖలు చేశారు. 1,442 వార్డులకు 38 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ తెలిపారు.