సమగ్ర శిక్ష ఏపీసీ పర్యటన

సమగ్ర శిక్ష ఏపీసీ పర్యటన

ASR: అనంతగిరి మండలం చిలకలగడ్డ ఆశ్రమ పాఠశాలను సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డా. స్వామి నాయుడు శుక్రవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. పదవ తరగతి పరీక్షలు భవిష్యత్తుకు తొలి మెట్టని, మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా అంశాలపై దిశానిర్దేశం చేశారు.