గర్నమెంట్ బడిలో చేర్చాలని ప్రచారం
నెల్లూరు: సంగంలో 'బడిపిలుస్తోంది' కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అన్ని వసతులు, ఉచిత పథకాలు ఉండే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చాలంటూ సంగంలో ర్యాలీ చేపట్టారు. పలువురి ఇళ్ల వద్దకు వెళ్లి వారి పిల్లలను తమ స్కూల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్, టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.