గ్రామీణ నాయకత్వ బలోపేతానికి సమావేశం

KNR: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) జిల్లా స్థాయి సమావేశం జరిగింది. గ్రామస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు RGPRS జాతీయ నాయకత్వం, పీసీసీ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న మాట్లాడారు. వెంకటరాం రెడ్డి సహా ఇతర నాయకులు పాల్గొన్నారు.