గురుకులంలో క్రీడా విభాగ ప్రవేశాలు

గురుకులంలో క్రీడా విభాగ ప్రవేశాలు

ATP: గుత్తి సమీపంలోని గొళ్లలదొడ్డి గిరిజన గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను క్రీడా విభాగంలో ప్రవేశాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అనంతపురం, చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాల గిరిజన బాలురు అర్హులు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మొత్తం 98 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 29న క్రీడా పోటీలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.