షాంపూర్‌లో జాతర షురూ.. హాజరైన ఎమ్మెల్యే

షాంపూర్‌లో జాతర షురూ.. హాజరైన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ ఏజెన్సీలో జాతర సందడి నెలకొంది. కేస్లాపూర్‌లో పూజలు ముగించుకున్న మెస్రం వంశీయులు శ్యాంపూర్‌ చేరుకుని బుడుందేవ్‌కు సంప్రదాయ పూజలు నిర్వహించారు. దీంతో వారం రోజుల జాతర లాంఛనంగా ప్రారంభమైంది. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.