VIDEO: నరసరావుపేటలో బైక్ రేసర్లపై పోలీసుల నిఘా

VIDEO: నరసరావుపేటలో బైక్ రేసర్లపై పోలీసుల నిఘా

PLD: నరసరావుపేటలో ప్రమాదకర బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువతపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిపై చిలకలూరిపేట డీఎస్పీ హనుమంతరావు స్పందిస్తూ.. రేసర్లను ఇప్పటికే గుర్తించామని, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. యువత ప్రాణాలతో చెలగాటమాడకుండా అడ్డుకట్ట వేస్తామని, నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.