బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల

బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల

యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గ్రామస్థులతో కలిసి ఆత్మీయంగా బోనాల పండుగ వేడుకల్లో ఒగ్గుడోలు వాయించారు. అనంతరం బీరప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, గ్రామస్థులు పాల్గొన్నారు.