ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాం: సీఎం రమేష్

విశాఖ: ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే రావికమతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి, 30 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి రావికమతం, టి. అర్జాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, జన సేన రాజు గారు పాల్గొన్నారు.