రెండు టిప్పర్లు సీజ్.. ఇద్దరిపై కేసు నమోదు
KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను సీజ్ చేసినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. హుజురాబాద్ మండలానికి చెందిన ధరంగుల మహేందర్, సంపంగి నగేష్ ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తుండడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.