మేడారం జాతరకు 'హెరిటేజ్' హోదా దక్కేనా..!

మేడారం జాతరకు 'హెరిటేజ్' హోదా దక్కేనా..!

MLG: మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరకు ప్రపంచ వారసత్వ వేడుకల జాబితాలో చోటు కల్పించాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది. గుడి, విగ్రహం లేకపోయినా నాలుగు రోజులు జరిగే ఉత్సవంలో కోటిన్నర మంది ఒక్కచోటకు చేరడం ప్రత్యేకత. ఇలాంటి ఉత్సవం ప్రపంచంలోనే అరుదైనది కావడంతో 'హెరిటేజ్ సైట్'గా గుర్తించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ దిశగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రయత్నం మొదలుపెట్టింది.