యూట్యూబ్‌లో చూసి చోరీలు

MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో బ్యాంకు, ఏటీఎంల చోరీలకు యత్నం, మద్యం దుకాణాల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. వెల్దుర్తి మండలం మానేపల్లికి చెందిన శ్రీకాంత్, లింగం, ప్రసాద్ మెదక్‌లోనీ బ్యాంకులో చోరీకి ప్రయత్నం, గుమ్మడిదలలో ఏటీఎం చోరీకి ప్రయత్నం, వెల్దుర్తిలో బ్యాంకు చోరీకి ప్రయత్నం చేశారు.