మేడిగడ్డ మరమ్మతులు వెంటనే చేపట్టాలి: ఎర్రబెల్లి
WGL: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టే బీఆర్ఎస్ పార్టీ నిజాయితీకి నిదర్శనమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పర్వతగిరి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీలో వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.