బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి
AKP: బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి చెందాడు. అచ్యుతాపురం, పూడిమడక తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చౌడిపల్లి దేముడు మరో నలుగురితో కలిసి చేపల వేటకు బోటులో వెళ్తుండగా తీరానికి సమీపంలో అలల ఉద్ధృతికి బోటు బోల్తా పడింది. నలుగురు సురక్షితంగా బోటులోకి చేరుకోగా దేముడు నీటిలో మునిగి మృతి చెందాడు. గత ఆరు నెలల్లో నలుగురు మత్స్యకారులు గల్లంతై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.