రేపల్లెలో CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ సోమవారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 23 మంది లబ్ధిదారులకు రూ.64 లక్షల 32 వేల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పట్టిందని తెలిపారు.