పాకిస్తాన్‌లో భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు

పాకిస్తాన్‌లో భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు

పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పాక్ కరెన్సీ ప్రకారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై అక్కడి ప్రభుత్వం ఏకంగా రూ.137 పెంచింది. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.458కి, లీటర్ డీజిల్ ధర రూ.520కి పెరిగింది. చమురు ధరలు ఒకేసారి భారీగా పెంచడంపై పాకిస్తాన్ పౌరులు భగ్గుమంటున్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.