రేపు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నూకాంబిక ఆలయ చైర్మన్ నాగశ్రీను తెలిపారు. నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా సాయంత్రం 7:00 నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.