గంజాయి గుట్టురట్టు చేసిన పోలీసులు
W.G: అచంట - మార్టేరు ప్రధాన రహదారిలో బాలంవారిపాలెం వద్ద అక్రమంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆచంట మండలానికి చెందిన కోట భానుసందీప్, వేములూరి ప్రభాస్, చెల్లెం పృథ్విరాజ్, నక్క బాలకృష్ణ, వెళగన వాసు, పెనుగొండకు చెందిన గెద్దాడ సుభాష్, దేవతల కృష్ణబాబులను ఆచంట పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.