తాడేపల్లిగూడెంలో ఏఐటీయూసీ నిరసన

తాడేపల్లిగూడెంలో ఏఐటీయూసీ నిరసన

W.G: ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. సోమసుందర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద అంబేద్కర్ చిత్రపటంతో నిరసన వ్యక్తం చేశారు. 4 కోడ్లపై పార్లమెంట్ లోనూ చర్చ జరగలేదని, కార్మిక సంఘాలతో చర్చల ప్రక్రియ ప్రారంభించాలని ఆయన కోరారు.