ఆర్జీయూకేటీలో ముగిసిన ఎలక్ట్రిక్ వాహనాలపై వర్క్ షాప్

NRML: బాసర ఆర్జీయూకేటీలో 3 రోజుల పాటు నిర్వహించిన ఎలక్ట్రిక్ వాహనాలపై హ్యాండ్స్-ఆన్ వర్క్ షాప్ సోమవారం విజయవంతంగా ముగిసింది. వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రపంచం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు ఇలాంటి నైపుణ్యాలు అత్యవసరమన్నారు. నేషనల్ మిషన్ ఆన్ పవర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.