ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం

NLG: నడిగూడెం మండలం సిరిపురంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మండపం వద్ద తొమ్మిది రోజులపాటు స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం మహిళలు, యువకులు, చిన్నారులంతా కలిసి కోలాటం, నృత్యాలతో గ్రామ వీధుల గుండా గణేష్ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తి చేశారు.