పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు
కృష్ణా: పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించాలంటే సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి రాంప్రదీప్ సూచించారు. తిరువూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠ్య పుస్తకాలు చదవడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు.