హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు: సీఐ
కోనసీమ: తల రాతను మార్చలేం కానీ... తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించుకోవచ్చునని రావుల పాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ అన్నారు. గురువారం ఆలమూరు మండలం జొన్నాడ నుంచి మడికి వరకు 216A జాతీయ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు ఆలమూరు ఎస్ఐ జి నరేష్‌తో కలిసి హెల్మెట్ దారణపై అవగాహన నిర్వహించారు. హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు.