VIDEO: డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
NLG: దేవరకొండ ఆర్టీసీ బస్సు డిపోలో కార్మికులు సమ్మె చేస్తుండడంతో బస్సులు మొత్తం డిపోలకే పరిమితమయ్యాయి. ఈరోజు ఉదయం 4:30 గంటలకి డిపో నుంచి బస్సులు ప్రారంభం కావాల్సి ఉండగా, ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు. దీంతో బస్సులు లేక బస్ స్టేషన్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. డిపో వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు సమ్మె కొనసాగుతుందదన్నారు.