మహిళలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం: ఎమ్మెల్యే

మహిళలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం: ఎమ్మెల్యే

ADB: భీంపూర్ మండలంలోని ధనోర, అందరబంద్, గుంజాల, కరంజి టి, రాంపూర్, భీంపూర్, మార్కగూడ, వడగావ్, వడూర్, నిపాని గ్రామాల్లో నూతన వివో భవన నిర్మాణాలకు బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలను మహిళలతోనే ప్రారంభిస్తామని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.