ఒకే కుటుంబం నుంచి ముగ్గురు కౌన్సిలర్లు

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు కౌన్సిలర్లు

BDK: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో ‘నార్లపాటి’ కుటుంబం అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే ఇంటి పేరు గల ముగ్గురు సమీప బంధువులు కౌన్సిలర్లుగా గెలుపొంది అందరినీ ఆశ్చర్యపరిచారు. 11వ వార్డు నుంచి నార్లపాటి మహేష్, 21-నార్లపాటి మౌనిక, 22-నార్లపాటి దివాకర్ విజయం సాధించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పురపాలనలో అడుగుపెట్టనున్నారు.