గండేపల్లి మండలంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం

గండేపల్లి మండలంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం

E.G: గండేపల్లి మండలం మురారి గ్రామంలోని అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించారు. జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం-పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.