రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు: ఎస్పీ
తిరుపతి: జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు SP ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లు, బాల్యవివాహాల నిరోధంపై కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.