'పిటిషన్ కేసులు వేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు'
MNCL: బెయిల్‌పై బయటకు వచ్చినా కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ కేసులు వేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో ఆయన 16 రోజులు జైల్లో ఉండగా.. న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం బాల్క సుమన్ జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేశారు.