VIDEO: మేడికొండూరులో రైతులకు యూరియా పంపిణీ
GNTR: మేడికొండూరు గ్రామ వ్యవసాయ కార్యాలయంలో బుధవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. వ్యవసాయ అధికారి లక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులందరికీ యూరియా సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు ఈ అవకాశంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.