సంతమాగులూరులో సర్వేను పరిశీలించిన ఎంపీడీవో

సంతమాగులూరులో సర్వేను పరిశీలించిన ఎంపీడీవో

BPT: సంతమాగులూరు మండలంలోని కుందూరు గ్రామంలో ఫీవర్ సర్వేను మండలం ఎంపీడీవో జ్యోతిర్మయి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న జ్వరాల సర్వేను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డాక్టర్లకు సూచించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.