'ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతను అందించాలి'
జిల్లాలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎంతో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతను అందించాలనే లక్ష్యంతో నడుస్తున్నామన్నారు. అలాగే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావలని గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా పీటీఎం సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది సీఎం లక్ష్యమని పేర్కొన్నారు.